ఏపీలో కొత్తగా 137 కరోనా కేసులు... తాజా వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 31,855 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 28 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • 1,705కి తగ్గిన యాక్టివ్ కేసులు
ఏపీలో గడచిన 24 గంటల్లో 31,855 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 137 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 23, తూర్పు గోదావరి జిల్లాలో 16, విశాఖ జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 189 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,683 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,59,500 మంది ఆరోగ్యవంతులయ్యారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య 1,705కి తగ్గింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,478కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Details
Today Cases

More Telugu News